ఆర్టీసీ సమ్మెకు ముగింపు ఆర్టీసీ ముగింపే సమాధానమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సమ్మె తర్వాత పాత ఆర్టీసీ ఉండే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ ఇక బతికి బట్ట కలిగే పరిస్థితి లేదన్నారు. సంస్థలోని 2,600 బస్సులు 10 లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగాయన్నారు. వీటిని మార్చాల్సిందేనని చెప్పారు. వీటి స్థానంలో కొత్త బస్సుల కొనుగోలుకు రూ. 800 కోట్ల నుంచి రూ. 1000 కోట్లు కావాలన్నారు. ఎక్కడి నుంచి తెస్తామని ప్రశ్నించారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని చెప్పారు.