ఆర్టీసీలో డబ్బు లేవు. జీతాలు ఇవ్వడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు హైకోర్టు ఏం చేస్తుంది? కొడుతదా? అని ప్రశ్నించారు తెలంగాణ సీఎం కేసీఆర్.
జీతాల కోసం ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, హైకోర్టు కూడా ఆదేశించింది కదా అన్న మీడియా ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పదించారు. సంస్థ వద్ద డబ్బులు లేనపుడు ఏం చేయాలన్నారు. సమ్మె పేరుతో ఆర్టీసీని సర్వ నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.