ఆర్టీసీ సమ్మె, సంస్థ మనుగడపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన కామెంట్ చేశారు. సమ్మె ఎప్పుడు ముగుస్తుందన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు
"సమ్మె కాదు... ఆర్టీసీయే ముగిసిపోయింది' అన్నారు. నిజం. ఇదే జరగబోతోంది. తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి చూస్తే భయమేస్తోందన్నారు. ఆదాయం, అప్పులు చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. ఇప్పటికే సంస్థకు 5 వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయన్నారు. అవి ఏటికేడు పెరుగుతున్నాయి, ఆదాయం వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో సమ్మెలు చేస్తూ ఉంటే సంస్థ మనుగడ ప్రమాదం కాదా అని ప్రశ్నించారు