Print
Hits: 2138

సూర్యపేట: జిల్లాలోని హుజూర్‌నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారానికి నేటితో తెరపడింది. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు, కాంగ్రెస్, బీజేపీ వంటి పలు పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు

తమ ప్రచారాన్ని ఈ రోజు సాయంత్రంతో ముగించారు. కాగా... హుజూర్‌నగర్ నియోజకవర్గ ఉపఎన్నికకు ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరగనుంది. 24వ తేదీన ఫలితం వెలువడనుంది. కాగా... బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారి భవితవ్యం 2,36,842 మంది ఓటర్ల చేతిలో ఉంది. ఉపఎన్నికకు నియోజకవర్గంలో మొత్తం 302 పోలింగ్‌స్టేషన్‌లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మరోవైపు 79 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలవుతుందని ఈసీ తెలిపింది. ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు హుజూర్‌నగర్ విడిచి వెళ్లాలని ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

e-max.it: your social media marketing partner