హైదరాబాద్: సిరిసిల్ల నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అందుకు తగ్గట్టుగా పారిశుద్ధ్య ప్రణాళికలు ఉండాలని అధికారులను ఆదేశించారు సిరిసిల్ల
ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగంతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సిరిసిల్ల నియోజకవర్గంలో పరిశుభ్రతే లక్ష్యంగా ప్రణాళికలుండాలని ఆదేశించారు. గ్రామ పారిశుద్ధ్య ప్రణాళికలో భాగంగా రూపొందించిన కార్యక్రమాల అమలుపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. 30 రోజుల గ్రామ ప్రణాళికను విజయవంతంగా పూర్తిచేసిన అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి అభినందనలు తెలిపారు. కాగా.. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ కూడా హాజరయ్యారు.