సూర్యాపేట: బ్రేకింగ్... నడిగూడెం (మం) చాకిరాల వద్ద వేగంగా వస్తోన్న కారు నిన్న రాత్రి ప్రమాదవశాత్తు సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తోన్న
ఆరుగురు ఆ కారులోనే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అయితే... గత 10 గంటలుగా శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాలువ నుంచి కారును బయటికి తీశారు. కారు డోర్లు లాక్ చేసి ఉండడంతో... కారులో ప్రయాణిస్తున్న వారు అందులోనే చిక్కుకుపోయి మృతి చెందారు. ఘటనా స్థలం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు తమ వారికోసం గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మరోవైపు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పోలీసులు కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.