హైదరాబాద్: టీఎస్‌ఐపాస్ ద్వారా 13 లక్షల ఉద్యోగాలను కల్పించామన్నారు మంత్రి కేటీఆర్. ఈ రోజు నగరంలోని హెచ్‌ఐసీసీలో సీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం
జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ఆర్థిక వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానం సాధించిందన్నారు. చిన్న ఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రైవేటు సెక్టార్‌లోనే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయని, తెలంగాణాలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతోందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యువత రాష్ట్రం దాటి పోకుండా అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.