హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మాట్లాడుతూ... రూ.85 వేల కోట్ల
ఆర్టీసీ ఆస్తులపై సీఎం కేసీఆర్ కన్నేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వంతో కొట్లాడి ఆర్టీసీ కార్మికులు వారి హక్కులు సాధించుకోవాలన్నారు. అంతేగాని కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, హక్కులను పోరాడి సాధించుకుందామన్నారు. రేపు ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన బంద్ లో కాంగ్రెస్ శ్రేణులు కూడా పాల్గొనాలని రేవంత్ పిలుపునిచ్చారు.