హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ఈ రోజు ఆయన నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో
న్యూక్లియర్ మెడిసన్ స్కాన్ ను , స్పెక్ట్ స్కాన్ ను ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... పేదలకు మెరుగైన వైద్యమందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగు పరుస్తోందన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన క్యాన్సర్ వైద్యం అందించడానికి అత్యాదునిక పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.