హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు ఈ రోజు లిక్కర్ దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సోమేశ్ కుమార్
మాట్లాడుతూ... ఈ లక్కీ డ్రా కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,216 దుకాణాలకు 48,401 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలకు పెంచినప్పటికీ మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయన్నారు. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.968.02 కోట్ల ఆదాయం వచ్చినట్టు చెప్పారు. అలాగే... డివిజన్ల వారీగా అత్యధికంగా రంగారెడ్డిలోని 422 మద్యం షాపులకు 8,892 దరఖాస్తులు వచ్చాయన్నారు. దీంతో ప్రభుత్వానికి రూ.177.84 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. 2017లో దరఖాస్తుల ద్వారా రూ.412 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.968.02 కోట్లు సమకూరినట్టు సోమేశ్ కుమార్ తెలిపారు.