కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖరీఫ్ ప్రణాళికపై మంత్రులు అధికారులతో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు
ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తో పాటు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సివిల్ సైప్లె కమిషనర్ అకున్ సబర్వాల్ జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ... నాణ్యతను బట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రవాణాలో ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గోదాముల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా తరలించాలని, అలాగే... ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ధాన్యం సేకరణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.