నిర్మల్: జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బందికి ఒక రోజు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు పేర్కొన్నారు. వారితో పాటు స్పెషల్ బ్రాంచ్ మరియు
సాయుధ దళ కార్యాలయ సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సి.శశిధర్ రాజు మాట్లాడుతూ... రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లు, పోలీసు కార్యాలయల్లో ఒకే విధమైన సేవలు ఉండాలనే ఉద్దేశ్యంతో 5Sను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. 5S అనే అంశం ద్వారా జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ లలో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. కాగా... 5S అంశం ద్వారా జిల్లా పోలీసు కార్యాలయము, స్పెషల్ బ్రాంచ్ మరియు ఆర్మ్డ్ రిజర్వ్డ్డడ్ కు చెందిన కార్యాలయాల్లో దీన్ని విజయవంతం చేయాలని ఎస్పీ సి.శశిధర్ రాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ సి.శశిధర్ రాజుతో పాటు అడిషనల్ ఎస్పీ కే.దక్షిణామూర్తి, అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్. వెంకట్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ మరియు సాయుధదళ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.