హైదరాబాద్: వివాదాస్పద అయోధ్య (రామజన్మభూమి-బాబ్రీ మసీదు) కేసులో వాదనలు ముగిశాయి. ఈ కేసును సుదీర్ఘ కాలం విచారించిన సుప్రీం తీర్పును
రిజర్వ్‌లో ఉంచింది. కాగా.. ఈ కేసుకు సంబంధించిన రాతపూర్వక దస్త్రాలను మరో మూడు రోజుల్లో కోర్టుకు సమర్పించనున్నారు. నేటి విచారణలో వివాదాస్పద స్థలం గురించి అన్ని పార్టీలు తమ వాదనలు వినిపించాయి. వక్ఫ్ బోర్డు, హిందూ మహాసభ, నిర్మోహి అఖాడాలు తమ అభిప్రాయాలు కోర్టుకు విన్నవించాయి.