హైదరాబాద్: ప్రభుత్వం దిగొచ్చేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్తామని, కార్మికుల
డిమాండులను పరిష్కరించాలని చెప్పారు. సమ్మె విచారించిన హై కోర్టు ఈ నెల 18 లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని చెప్పారు. ప్రభుత్వం మోడీ వైఖరి అవలంబించవద్దని, ప్రజలకు ఇబ్బంది కలిగించ వద్దని అశ్వత్థామ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.