సూర్యాపేట: ఈనెల 17న హుజూర్ నగర్ లో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ రోజు
ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ మాటలు వినడానికి, ఆయనను చూడటానికి హుజూర్‌నగర్ ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారన్నారు. కేసీఆర్ సభ ట్రెండ్ సెట్టర్ అవుతుందని చెప్పుకొచ్చారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పులిచింతల బాధితుల సమస్యకు, రెవెన్యూ డివిజన్ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపెడుతుందని ఆయన స్పష్టం చేశారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘానా విజయం సాధిస్తుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.