ఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసై సుందర్ రాజన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ చేరుకుని... 3 గంటలకు
ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. కాగా... తమిళిసై తెలంగాణ గవర్నర్ గ నియమించిన తరువాత ఆమె తొలిసారిగా ప్రధానితో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా పరిణామాలు... ఆర్టీసీ కార్మికుల సమ్మె తదితర విషయాలపై వారు చర్చించనున్నట్టు సమాచారం.