కరీంనగర్: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులపై పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్‌దే బాధ్యత అని ఈ మేరకు చార్కియాలు
తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రుల మాటలతో కార్మికులు మనస్తాపానికి గురవుతున్నారని అందువల్ల 24గంటల్లో కేసు నమోదు చెయ్యాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. లేకపోతే స్టేషన్ ముందు కూర్చుని ఆందోళన చేస్తానని శోభ హెచ్చరించారు.