ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ప్రాణత్యాగం తనను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్. ఈ మేరకు ఆయన ట్విట్టర్
వేదికగా స్పందించారు. కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులను ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లోకి నెట్టకుండా ఉండాల్సిందని టీఆర్ఎస్ ప్రభుత్వానికి పవన్ హితవు పలికారు. కోరుకున్న తెలంగాణ ఆవిర్భవించిన తరువాత కూడా ఇటువంటి బాధాకర సంఘటన చోటు చేసుకోవడం శోచనీయం. ఇకనైనా ఈ సంక్షోభానికి ప్రభుత్వం ముగింపు పలకాలని జనసేనాని విజ్ఞప్తి చేశారు.