హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఓ వైపు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం వెనక్కు
తగ్గడంలేదు. ఇప్పటికే కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ నియమించుకున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది నియామకం కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీస్ శాఖలో పనిచేసి పదవీవిరమణ పొందిన డ్రైవర్ల నుంచి కూడా దరఖాస్తులను ఆహ్వానించింది. వీటితోపాటు మెకానిక్‌లు, శ్రామిక్‌లు, టైర్ మెకానిక్‌లు, ఎలక్ట్రీషియన్లు తదితర పోస్టులకు కూడా ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది.