సంగారెడ్డి: ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమంటూ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సమ్మె ఆపలేని
రవాణా మంత్రి ఆ పదవికి అనర్హుడని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు 9 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని, వారి డిమాండ్లకు సరైన సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. సమైక్యరాష్ట్రంలో కూడా ఇంత దారుణం ఎప్పుడూ జరగలేదని వాపోయాడు. తెలంగాణ తెచ్చుకున్నది ఇలాంటి పాలన కోసమా అని ప్రశ్నించారు. ప్రజలు ఈ పాలన కోరుకున్నారా? ఇందుకు సీఎం కేసీఆర్ తలదించుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. మీకు కాంగ్రెస్ అండగా ఉంటుందని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులపై సీఎంకు విషాన్ని నూరి పోసేది ఎవరని ఆయన ప్రశ్నించారు. సీఎం ఒక మెట్టు దిగి ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.