గుజరాత్: భారత ప్రధాని నరేంద్రమోదీ తల్లిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ వెళ్లిన
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్... ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ గాంధీనగర్‌లోని ఆమె నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో కాసేపు ముచ్చటించి... ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వయసులోనూ ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందనీ, ఇలాంటి వారు మనందరికీ ఆదర్శప్రాయులని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.