హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను రెచ్చగొడుతూ... ప్రభుత్వంపై విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. ఈ రోజు ఆయన మీడియాతో
మాట్లాడుతూ... ఆర్టీసీ యూనియన్ నేతలు విపక్షాల వలలో చిక్కుకుని కార్మికుల ఉద్యోగాలు పోయేందుకు కారణమయ్యారన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీసీ కార్మికులకు వేతనాలు ఇస్తున్నామని.. ఎప్పుడూ లేని విధంగా కార్మికులకు 44శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామన్నారు. దేశంలో బీజేపీ పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపారు అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఆర్టీసీకి సీఎం కేసీఆర్ రూ.3303 కోట్ల సహాయం అందించారని చెప్పారు. అలాగే... ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని మంత్రి ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.