భద్రాద్రి కొత్తగూడెం: టీఎస్ఆర్టీసీ సమ్మె 9వ రోజుకు చేరుకుంది. కార్మికులు సమ్మె చేయడం, అటు ప్రభుత్వం కూడా దిగిరాక పోవడంతో ఆర్టీసీ కార్మికులు
ఈరోజు ఉదయం కొత్తగూడెంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ... ప్రభుత్వం దిగిరాక పొతే సమ్మె ఉధృతం చేస్తామని కేసీఆర్ పాలన అంతమవుతుందని నినాదాలు చేస్తూ.. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఎట్టి పరిస్థితుల్లో పనిచేయమని డిపో ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఈ నేపధ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.