హైదరాబాద్: గల్ఫ్ వెళ్లిన తెలంగాణ బిడ్డలు తిరిగి వచ్చేయండని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. గల్ఫ్‌కు వెళ్లిన తెలంగాణ బిడ్డలకు సంబంధించి ఈ రోజు
సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... ఇక నుంచి తెలంగాణ బిడ్డలు గల్ఫ్‌లో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడ చేసుకోవడానికి చాలా పనులున్నాయని చెప్పుకొచ్చారు. మన రాజధాని హైదరాబాద్ నగరంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయని, పనికి మనుషులు దొరక్క వేరే రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటున్న పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం త్వరలో గల్ఫ్ దేశాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో రాష్ట్రంలో ఉన్న ఉపాధి అవకాశాలను సీఎం గల్ఫ్ కార్మికులకు వివరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్లగొండలో సగం, రెండు పంటకు నీరు అందించే విషయాన్నీ సీఎం వారితో స్వయంగా చర్చించనున్నారు.