హైదరాబాద్: ఈ నెల 19వ తేదీ వరకు దసరా సెలవులను పొడగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె వలన బస్సులు తిరగక పోవడంతో
స్కూళ్లకు దసరా సెలవులను పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఆర్టీసీ మంత్రి పువ్వాడ అజయ్, ఇతర అధికారులతో చెర్చించిన సీఎం… అనంతరం సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.