హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని, ఈ సమ్మెను ప్రభుత్వం గుర్తించదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ యూనియన్ నాయకుల పిచ్చిమాటలు నమ్మి
కార్మికులు ఉద్యోగాలను వదులుకున్నారని అన్నారు. ఈ రోజు మధ్యహ్నం సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఆర్టీసీ మంత్రి అజయ్, అధికారులతో చెర్చించిన సీఎం అనంతరం మాట్లాడుతూ… గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ సూపర్‌వైజర్లను కూడా ఈసారి సమ్మెలోకి దింపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 48వేల మంది ఆర్టీసీ ఉద్యోగాలు పోయేలా చేశారని వ్యాఖ్యానించారు. కాగా... ఆర్టీసీలో 50శాతం బస్సులను నడిపేందుకు వెంటనే సిబ్బందిని నియమించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరో 30శాతం బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని సూచించారు. అలాగే... 20శాతం ప్రైవేట్ బస్సులకు స్టేజీ క్యారేజీలుగా పర్మిట్‌లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బస్సు డిపోల వద్ద కార్మికులు ఆందోళనలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మూడురోజుల్లోగా అన్ని 100% శాతం బస్సులు నడపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.