హైదరాబాద్: బస్ భవన్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సొమ్మసిల్లి పడిపోయారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ...
కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు, విపక్షాలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి ఆర్టీసీ భవన్ ఎదుట ధర్నా చేస్తుండగా లక్ష్మణ్ సొమ్మసిల్లి పడిపోయారు. మరోవైపు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి నారాయణగూడ పీఎస్‌కు తరలించారు. కాగా... లక్ష్మణ్‌కు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఫోన్ చేసి పరామర్శించారు.