హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 8వ రోజుకు చేరింది. నగరంలోని ఆర్టీసీ బస్‌భవన్ దగ్గర కార్మికులు ఆందోళనకు దిగారు.
అయితే... కార్మికుల ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో బస్ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఈ రోజు ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణతో పాటు రాష్ట్ర బంద్‌పై నేతలు చర్చించనున్నారు. కాగా... జిల్లాల్లోని అన్ని ఆర్టీసీ డిపోల దగ్గర కార్మికులు వారి కుటుంబ సభ్యులతో కలిసి మౌన ప్రదర్శన నిర్వహించారు.