హైదరాబాద్: మావోయిస్టు సంస్థలను కమిషనర్ అంజనీ కుమార్ యాదవ్ తీవ్రంగా హెచ్చరించారు. అమాయక యువకులను హింసా మార్గంలోకి తీసుకెళ్లేవిధంగా
తప్పుదారి పట్టించవద్దని మావోయిస్టు సంస్థలకు సీపీ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టీవీవీ వంటి ఆర్గనైజేషన్లకు మావోయిస్టు గ్రూపులతో సంబంధం ఉందన్నారు. వారు అమాయకపు యువకులను హింస వైపు మల్లే విధంగా దారి మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల చేపట్టిన తనిఖీల్లో వారి వద్ద ప్రభుత్వం నిషేధిత వస్తువులు కూడా కనుక్కొన్నామని వెల్లడించారు. చాలా మంది నకిలీ మేధావులు అలాంటి ఫ్రంట్‌లతో సంబంధం కలిగి ఉన్నారని సీపీ పేర్కొన్నారు.