హైదరాబాద్: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని ఇథియోపియా ప్రధాని అబే అహ్మాద్ అలీ గెలుచుకున్నారు. ఈ మేరకు స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో నోబెల్
పురస్కార కమిటీ ఈ రోజు నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించింది. శాంతి స్థాపన కోసం, అంతర్జాతీయ సహకారం కోసం అలీ చేసిన కృషిని నోబెల్ పురస్కార కమిటీ గుర్తించింది. పొరుగు దేశం ఎరిత్రియాతో సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో ప్రధాని అహ్మాద్ అలీ విశేషంగా కృషి చేసినట్లు నోబెల్ కమిటీ తన ట్వీట్‌లో పేర్కొంది.