హైదరాబాద్: మంగళ్‌పల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కును మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. రూ.22 కోట్లతో హెచ్ఎండీఏ - ఆన్‌కాన్ లాజిస్టిక్స్ పార్క్ ను ఏర్పాటు చేసిన
సంగతి తెలిసిందే. పెద్ద అంబర్‌పేట జంక్షన్ నుంచి బాట సింగారం వరకు రూ.1.82 కోట్లతో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర స్ట్రీట్ లైట్ల ఏర్పాటు పనులను అధికారులు ప్రారంభించారు.
అలాగే... గ్రేటర్ పరిధిలో పలు ప్రగతి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన్ చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువులలోకి మురుగునీరు వచ్చి చేరకుండా రూ.23 కోట్లతో హెచ్‌ఎండీఏ చేపట్టనున్న ట్రంక్ లైన్ పనులకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.