హైదరాబాద్: 'అలాయ్ బలాయ్' లాంటి కార్యక్రమాలు మానవ సంబంధాలను ఎంతో మెరుగుపరుస్తాయన్నారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. ఈ రోజు హైదరాబాద్‌లోని
జలవిహార్‌లో నిర్వహించిన 'అలాయ్ బలాయ్' కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బీజేపీ సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ 15 ఏళ్లుగా అలాయ్ బలాయ్ నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. అలాగే... తాను తెలంగాణకు గవర్నర్‌గా రావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో మహిళలకు ఎంతో గౌరవం ఉంటుందని... ఇక్కడి ప్రజలు మహిళలను సోదరి సమానులుగా చూస్తారని కొనియాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలన్నీ తమిళనాడులోలాగే ఉన్నాయని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ చెప్పారు.