Print
Hits: 1443

నగరంలో చారిత్రాత్మకమైన మక్కా మసీదులో బాంబు పేలుళ్ల ఘటనకు ఈ 18 వ తేదీకి సరిగ్గా ఎనిమిదేళ్లు.ఐతే...మక్కాపేలుళ్ల రోజు  వస్తే చాలు నగరపోలీసులు  ఉలిక్కిపడేవారు.ఎందుకుంటే ఆ రోజు పోలీసులను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాది వికారుద్దీన్ విరుచుకుపడేవాడు.

అలా వరుసగా కొన్ని సంవత్సరాలు నగరంలో అలజడి సృష్టించిన వికారుద్దీన్ ఓ కానిస్టేబుల్ తోపాటు హోంగార్డును హతమార్చాడు.ఐతే...తరువాత వికార్ పోలీసులకు చిక్కటంతో ఆ టెన్షన్ నుంచి పోలీసులు బయటపడగలిగారు. ఐతే..ఇప్పుడు  పోలీసులకు మరో టెన్షన్ పట్టుకుంది.ఈ మధ్యే  వికార్ ఎన్ కౌంటర్ లో మరణించటం..అతడి ఎన్ కౌంటర్ కు ప్రతీకారంగా ఈ సారి మే 18 న ఉగ్రవాదులు దాడులు జరపవచ్చన్న వార్తలు పోలీసులను కలవరానికి గురిచేస్తున్నాయి.దీంతో మక్కా బ్లాస్ట్ డే సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. నగర చరిత్రపై అదో రక్తపు మరక...పధ్నాలుగు  మంది అమాయక ప్రాణాలను బలితీసుకున్న ఆ ఘటనే...చారిత్రాత్మక మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుళ్లు.  ఏడేళ్ల క్రితం అంటే 2007 మే 18వ తేదీన సరిగ్గా సామూహిక ప్రార్థన సమయానికి  ఈ పేలుడు సంభవించింది. తీవ్ర సంచంలనం సృష్టించిన ఈ కేసు అనేక వివాదాలకు కారణమైంది. ఇక మరోవైపు 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్ల ఘటన జరిగిన ఏడాది తర్వాత కరడుగట్టిన తీవ్రవాది వికారుద్థీన్ నగరంలో పోలీసులను లక్ష్యం చేసుకుని దాడులకు పాల్పడుతూ అలజడి సృష్టించాడు.2009 మే 18 న ఫలక్‌నుమా సమీపంలోని నాగులబండ వద్ధ ఇద్దరు పోలీసులపై కాల్పులు జరిగిన సంఘటన తెలిసిందే. ఈ కాల్పుల్లో బాలస్వామి అనే హోంగార్డు మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. ఆ తర్వాత మే నెలను టార్గెట్ చేసుకుని వికారుద్ధీన్ మరోసారి విరుచుకుపడ్డాడు. ఖిల్వత్ సమీపంలోని ఓ సమస్యాత్మక ప్రాంతంలోని ఓ హోటల్ వద్ధ బందోబస్తు విధుల నిర్వహిస్తున్న ఎపిఎస్పీ 11 వ బెటాలియన్‌కు చెందిన రమేష్‌యాదవ్ అనే కానిస్టేబుల్ పై వికారుద్ధీన్ విచక్షణారహితంగా కాల్పులు జరపటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ రకంగా మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం మే నెలను టార్గెట్‌ను చేసుకుని తీవ్రవాది వికారుద్ధీన్ దాడులకు పాల్పడ్డాడు.

 

e-max.it: your social media marketing partner