Print
Hits: 1203

తెలంగాణ సాధన త‌ర్వాత ఉనికిని కోల్పోతున్న టీజేఏసీ ... మళ్లీ కీలకపాత్రతో తెరపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లు జూన్ రెండున జరిగే వేడుకల్లో కీలకపాత్ర పోషించనుంది. టీజేఏసీ ఉండగానే కొత్త జేఏసీలు వస్తుండడంతో అప్రమత్తమైన టీజేఏసీ నేతలు తమ పాత్రపై దృష్టి సారించారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీజేఏసీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్కసారిగా తెరమీద నుంచి మాయమైంది. ముఖ్యమంత్రి కేసిఆర్ కు, టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ కు మధ్య విబేధాలు వచ్చాయన్న వార్తలతో టీజేఏసీ నేతలు కూడా ఆక్టివ్ గా పనిచేయడం మానేశారు. సొంత రాష్ట్రంలో దేని మీద మాట్లాడినా కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని విమర్శించినట్లే ఉంటుందన్న భావనతో వేచి చూద్దామనే ధోరణి అవలంభించారు. రైతుల ఆత్మహత్యలు, ఆర్టీసి కార్మికుల సమ్మెలలో పాల్గొని వారి పక్షానా మాట్లాడినా...ఉద్యమించిన సందర్భాలు లేవు. ఈలోపు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న టీజేఏసీ సరైన స్థాయిలో పోరాడలేకపోతోందని కొత్త జేఏసీలు ఊపిరిపోసుకుంటున్నాయి. దీంతో టీజేఏసీ నేతలు ఇంకా ఊరుకుంటే మంచిది కాదనే అభిప్రాయానికి వచ్చారు. ప్రభుత్వానికి ఏడాది కాలం పూర్తి కావడంతో ఇక జూన్ రెండున జరిగే ఆవిర్భావ దినోత్సవం నుంచి ప్రజల పక్షాన పనిచేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. 

https://www.youtube.com/watch?v=gfDvcj5cwc4

e-max.it: your social media marketing partner