అనాథలకు ప్రభుత్వమే తల్లి దండ్రిగా ఉండేలా ఒక విధానాన్ని రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
అనాథ పిల్లల చదువు, వసతి, ఇతర అంశాలపై మంత్రులు పోచారం, కేటీఆర్, లక్ష్మారెడ్డి, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో గణితంలో ఇద్దరు అమ్మాయిలు చూపిన ప్రతిభ తనను ఆకట్టుకుందన్నారు. వారు అనాథలు అని తెలియడంతో బాధ కలిగిందన్నారు. అప్పుడే అనాథల కోసం ప్రభుత్వమే అండగా నిలిచేలా విధానం రూపొందించాలని నిర్ణయం తీసుకున్నానని కేసీఆర్ చెప్పారు. అనాథల కోసం ఇంటి గ్రేటెడ్ రెసిడెన్సీయల్ స్కూల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మొదటి పాఠశాలను యాదగిరి గుట్ట లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రారంభించే యోచన చేస్తున్నట్లు తెలిపారు.