ఫంక్తు రాజకీయాల కోసం యోగాపై విమర్శలు చేయడం టీఆర్ఎస్ నేతలకు తగదని బీజేపీ శాసన సభాపక్షనేత కె.లక్ష్మణ్ విమర్శించారు. ఆరోగ్య సమాజం కోసం చేసిన యోగాను విమర్శించిన వారు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంఐఎం పార్టీ కోసం గులాబీ నేతల విమర్శలు స్వార్థ రాజకీయాలకు నిదర్శనమన్నారు.