ఖరీఫ్ లో కల్తీ ఎరువులు.. విత్తనాల సరఫరాలో కఠినంగా వ్యవహరించాలన్నారు సీఎం కేసీఆర్.
అనాథ పిల్లల విద్యా వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని.. జిల్లాల వారిగా వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. పేకట క్లబ్బులు నడువకుండా పోలీసులు కఠినంగా వ్యవహిరించాని ఆదేశించింది ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి.... యాదగిరి గుట్ట.. వరంగల్ రహదారికి భూసేకరణ చేయాలని ఆదేశించింది సర్కార్. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ మొదలైన నేపథ్యంలో అధికారులు... రైతులకు అండగా ఉండాలని.. ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా చూడాలని ఆదేశించారు సీఎం. కల్తీ ఎరువులు, పురుగుల మందులు సరఫరా చేసే విషయంలో కఠినంగా వ్యవహిరించాలని ఆదేశించారు. అనాథ పిల్లల చదువులకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. జిల్లాల వారిగా అనాథ పిల్లల వివరాలు సేకరించి... వారిని ఏవిధంగా ఆదుకోవాలని నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. అనాథలకు ప్రత్యేక హస్టల్స్ కాకుండా.. ఇంటిగ్రేటేడ్ హస్టల్స్ లో నే చేరుస్తామన్నారు. రాష్ట్రంలో పేకాట క్లబ్బులపై కఠినంగా వ్యవహరించాలన్నారు సీఎం కేసీఆర్. హైద్రాబాద్ లో కట్టుదిట్టం చేయగానే.. పట్టణాలకు.. ఫామ్ హౌజ్ లల్లోకి స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని.. ఎక్కడికి తరలించినా.. నడవకుండా పోలీసులు నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్లు నిర్మించాలన్నారు సీఎం. మూడు ప్లాంట్స్ నిర్మించేందుకు స్థల సేకరణ చేయాలని రంగారెడ్డి, మెదక్ కలెక్టర్లను ఆదేశించారు సీఎం. ఇక కాళేశ్వరం.. ఎత్తిపోతల పథకానికి భూ సేకరణ చేయాలని ఆదేశించారు. దీంతో పాటుగా కేంద్రం ఇటీవల మంజూరు చేసిన యాదగిరి గుట్ట నుంచి వరంగల్ వరకు నాలుగు లైన్ల విస్తరణ భూ సేకరణ చేయాలని ఆదేశించారు సీఎం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని ఈ ఏడాది నుంచి అమలుచేస్తామన్నారు. ఇందుకోసం ఈ ఏడాది50 వేల ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇప్పటికే వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాకు హామీ ఇచ్చిన విధంగా ఎక్కువ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు సిమెంటు, స్టీల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో చర్చిస్తుందన్నారు. వ్యవసాయ ప్రంతాల్లో ఇండిపెండెంట్ హౌజ్ లు... పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్, జీ ప్లస్ టూ పద్దతిలో ఇళ్లు నిర్మిస్తామన్నారు సీఎం కేసీఆర్. హైద్రాబాద్ లో లేఅవుట్ చేసిన స్థలాల్లో మొదటి ప్రాధన్యత ఇవ్వాలన్నారు సీఎం కేసీఆర్.