దివంగత ఆచార్య జయశంకర్ సార్ నాలుగో వర్థంతి నేడు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఉదయం తెలంగాణభవన్‌లో జయశంకర్‌సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించనున్నారు. తొలి, మలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంతకర్త అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ తెలంగాణవ్యాప్తంగా నేడు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించనున్నారు.