టెన్షన్ లేనేకా నహీ...! టెన్షన్ దేనేకా హై...! తెలుగు రాష్ట్రాల సీఎంలు..., ఇద్దరు చంద్రుల మధ్య సరికొత్త మైండ్ గేమ్ మొదలైంది..! ఏదో జరుగుతోంది...ఇంకేదో జరగబోతోందంటూ ముందు లీకులు ఇస్తున్నారు..! ఆపై ఇరు రాష్ట్రాల మంత్రులు మాటల యుద్ధం...! ఆ వెంటనే గవర్నర్ నరసింహన్ తో భేటీలు...సచివాలయంలో సమీక్షలు...! సవాళ్లకు ప్రతి సవాళ్లు..!  ఓటుకు నోటుతో మొదలైన ఈ లొల్లి...ఏపీ నేతల ఫోన్ల ట్యాఫింగ్ ఆరోపణలతో తారస్థాయికి చేరింది.

ఇప్పుడు సెక్షన్ 8, హైదరాబాద్ పై సీమాంధ్రుల హక్కుల సెంటర్ పాయింట్ గా జగడం జరుగుతోంది..! తాజాగా ఇద్దరు టీ టీడీపీ నేతలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. టీ టీడీపీ నేత వెం నరేందర్ రెడ్డిని గంటలపాటు విచారించారు. దీంతో ఇరు రాష్ట్రాలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. బుధవారం ఉదయం గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్ ఈ వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు జరుగుతున్న పరిణామాలపై ఏపీ సర్కార్ కేబినెట్ సమావేశంలో చర్చించింది. మొత్తానికి ఈ వివాదం క్లైమాక్స్ కు చేరినట్లే కనిపిస్తోంది..! 

తెలుగు రాష్ట్రాల మధ్య కథ క్లైమాక్స్ చేరినట్లే కనిపిస్తోంది..! ఇక ఇద్దరు చంద్రుల సీన్ ఆఫ్ యాక్షన్ పై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది..! ఏది ఏమైనా తెలంగాణ సర్కార్ ఓటుకు వ్యవహారంలో తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది.. టీ టీడీపీ నేతలు వెం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్రకు రాత్రికి రాత్రే నోటీసులు జారీచేసినా ఏసీబీ...బుధవారం నాలుగు గంటలపాటు విచారణ అనంతరం వేం నరేందర్ రెడ్డిని వదిలివేసింది.

రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు...! పార్టీలన్నీ టైమింగ్ ను బట్టి దూకుడు ప్రదర్శిస్తాయ్..! ప్రత్యర్థుల్ని డిఫెన్స్ లో నెట్టేస్తాయి..! ఓటుకు నోటు కేసులో తెలంగాణ సర్కార్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఏసీబీ డీజీ ఏకే ఖాన్ మంగళవారం ఒకే రోజు రెండు సార్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అటు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గవర్నర్ నరసింహన్ ను కలిశారు. దీంతో ఈ కేసులో ఏవో కీలక పరిణమాలు జరగనున్నాయనే ప్రచారం మొదలైంది. ఇటు సీఎం కేసీఆర్ తో వీరు భేట అయ్యారు. ఆ తర్వాత రాత్రి మరోసారి సమావేశమయ్యారు. ఈ కేసు పై తాము తీసుకోబోతున్న చర్యలను అటు గవర్నర్ , ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. 

ఇప్పటికే ఈ వ్యహారంలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ ఇప్పుడు మరింత దూకుడును పెంచింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, కాల్ డేటాతో సేకరించిన సమాచారం ఆధారంగా తెలుగు దేశం ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలపై దృష్టి పెట్టింది. రాత్రికి రాత్రే ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని సండ్ర నివాసానికి వెళ్లిన ఏసీబీ అధికారులు ముడుపుల కేసులో విచారణకు హాజరు కావాలని...సీఆర్ పీసీ సెక్షన్ 160 ప్రకారం ఆదేశిస్తూ నోటీసులు కిటికి గుండా జారవిడిచారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు... ఆ తర్వాత రాత్రి 11:30కు ఆదర్శ్ నగర్ లోని వేం నరేందర్ నివాసానికి చేరుకున్న ఏసీబీ అధికారులు....వేం నరేందర్ ను విచారణ కోసం తమతోపాటు రావాలని కోరారు. దీనికి ఆయన నిరాకరించారు.అతనకు ఆరోగ్యం సరిగా లేదని   ఉదయం విచారణకు హాజరవుతానని ఆయన తెలపడంతో ఏసీబీ అధికారులు వెనుదిరిగారు.

బుధవారం ఉదయం  11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలపాటు వేం నరేందర్ రెడ్డిని విచారించిన ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు మొదట ప్రచారం జరగింది. అయితే తనను అరెస్టు చేయలేదని...విచారణకు ఎప్పుడు పిలిచిన రావాలన్నారని...విచారణ అనంతరం వేం నరేందర్ రెడ్డి తెలిపారు. 

ఈ కేసులో ఏ 2గా ఉన్న సెబాస్టియన్ ఫోన్ నుంచి ఎక్కువ సార్లు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కాల్స్ వెల్లినట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వల్ల అంతిమంగా లబ్ది చేకూరేది నరేందర్ రెడ్డి కావడంతో...ముడుపుల బాగోతం మొత్తం ఆయనకు కూడా తెలుసివుంటుందని ఏసీబీ భావిస్తోంది. అందుకే మొదట వీరిద్దరిని ప్రశ్నించారని భావిస్తున్నారు. ప్రాథమికంగా తగిన ఆధారాలు సేకరించాకే ఇద్దరికి నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. స్టీఫెన్‌కు మరో నాలుగున్నర కోట్ల రూపాయలను నరేందర్ రెడ్డి ద్వారా సర్దుబాటు చేసే ప్రయత్నం జరిగినట్లు  ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం..ఆ కోణంలో నే ఆయన్ను..మంగళవారం రాత్రే ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది.

అటు ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19 వ తేదీలోగా ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొంది.  శుక్రవారం సాయంత్రం విచారణకు హాజరయ్యే సండ్రను సైతం ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తారనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. టీడీపీ నేతలు వేం నరేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య విచారణలో తెలిపే సమాచారం ఆధారంగా మరికొంత మందికి నోటీసలుఉ జారీ చేస్తారని అంటున్నారు.ఏసీబీ నోటీసులు అందుకునే వారిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు ఆయనకు సన్నిహితంగావుండే ఓ కేంద్రమంత్రి, ఏపీ రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయ్.

రేవంత్ కాల్ డేటాలో వందల సంఖ్యలో ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ ఉన్నప్పటికీ... సహ నిందితులతోపాటు ఇతర రాజకీయ ప్రముఖులతో ఆయన ఎక్కువసార్లు సంభాషణలు సాగించినట్లు గుర్తించారు. వీరిలో ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే వారు, కొందరు వ్యాపార ప్రముఖులు ఉన్నారని సమాచారం. రేవంద్ ను అరెస్టు చేసిన సమయంలో రికార్డు చేసిన ఆడియో, వీడియో టేపులు, ఐఫోన్లు...సోదాల్లో రేవంత్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ ను పరీక్షల నిమిత్తంఎఫ్ఎస్ఎల్ కు తరలించారు. వీటిని మూడు దశల్లో పరీక్షించాల్సివుంది. ఇక ఈ కేసులో ప్రధాన సాక్షి, ఫిర్యాదుదారుగా ఉన్న స్టీఫెన్ బుధవారం ఏసీబీ కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. 

మొత్తానికి హైడ్రామా మధ్య...వేం నరేందర్ రెడ్డి తిరిగి ఇంటికి వెళ్లారు..ఇక మిగిలింది ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. విచారణకు హాజరయ్యే ఆయన్ను అరెస్టు చేస్తారా ? లేక ప్రశ్నించి వదిలేస్తారా ? ఇప్పుడు ఇదే హాట్ టాఫిక్ గా మారింది.! 

 

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...