గవర్నర్ వ్యవస్థపైనే తనకు నమ్మకం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారని, అంత నమ్మకం లేకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన తొలగిపోవాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు.
లేకపోతే గవర్నరే మిమ్మల్ని తొలగించాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ను గవర్నర్ వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన కోరారు. చంద్రబాబు తెలివితేటలను చూసి తెలుగు ప్రజలు నవ్వుకుంటున్నారని, ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం ఉండి కూడా కేవలం ఒక కేసులో తనకు అనుకూలంగా వ్యవహరించడం లేదన్న కారణంతో ఆయనపై విమర్శలు చేయడం సరికాదన్నారాయన.