టెలిఫోన్ సంభాషణలను ట్యాపింగ్ చేసేందుకు అవసరమైన పరికరాలను విక్రయించేది టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన కంపెనీయే అని వైకాపా నేత విజయసాయి రెడ్డి అన్నారు.
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ నోటుకు ఓటు స్కామ్‌లో చంద్రబాబు పాత్ర ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, అందువల్ల ఆయనను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
తమను అన్యాయంగా జైలుకు పంపిన చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. తమను జైలుకు పంపడంలో ఆయన కుట్ర ఉందని ఆరోపించారు. బాబు నేరం చేశాడు కాబట్టే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విజయసాయి అభిప్రాయపడ్డారు.
ఈ స్కామ్‌లో స్పష్టమైన ఆధారాలున్నా ఎందుకాయనను అరెస్టు చేయడంలేదని ప్రశ్నించారు. ఏపీలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని, 120 ఫోన్లు ట్యాప్ అయ్యాయని బాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. మన దేశంలో టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు అమ్మేది పాటూరి రామారావు, సుజనా చౌదరికి చెందిన కంపెనీలేనని విజయసాయి గుర్తు చేశారు.