ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్. ఓటుకి నోటు వ్యవహారంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని జగన్ కలిసి... సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశాడు. చంద్రబాబు నాయుడు.... ఏపీని స్కామాంధ్ర ప్రదేశ్ గా మారుస్తున్నాడని విమర్శించారు జగన్.
ఓటుకు నోటు కేసు వ్యవహారం ఢిల్లీకి చేరడంతో..రాజకీయం రంజుగా మారింది.. ఏపి ప్రతిపక్షనేత జగన్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంతో పాటు...తనపై ఇన్నాళ్లూ టిడిపి చేసిన అవినీతి ఆరోపణలకు బదులుగానా అన్నట్లు జూలు విదిల్చారు..అసలు చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు..అందుకు ఇప్పుడు అవకాశం దొరికిందన్నారు.
ఢిల్లీ పర్యటనకు వచ్చిన గవర్నర్ నరసింహన్ మాత్రం తాను వచ్చింది ఈ వ్యవహారంపై కాదని..రెండు తెలుగు రాష్ట్రాల ఏడాది పాలన పై మాత్రమేనన్నారు.. ఇక ప్రస్తుతం టిఆర్ఎస్ ఆరోపణల జడివానలో చిక్కుకున్న ఏపి సిఎం చంద్రబాబు చైనా పెట్టుబడిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు..పని లోపనిగా ఇవాళ కేంద్రమంత్రులతో భేటీ అవుతారు..అలానే బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను..ప్రధాని మోడీని చంద్రబాబు కలుస్తారని తెలుస్తోంది.
గవర్నర్ నర్సింహన్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలువనున్న నరసింహన్...రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు.. ప్రధానంగా ఓటుకు నోటు విషయంలోఅరెస్టైన రేవంత్ రెడ్డి అంశంతో పాటు..ఇదే అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర, బాబు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..
తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడిగా సాగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల్లో గవర్నర్ నరసింహన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.. గవర్నర్ తన రెండు రోజుల పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఇతర కేంద్రమంత్రులను కలవనున్నారు.. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఇష్యూతో పాటు, ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాఫింగ్ వ్యవహారంపై ప్రధానంగా చర్చించనున్నారు. మరో వైపు ఇదే అంశంపై సిబిఐ తో దర్యాప్తు చేయించాలనే డిమాండ్ పెరగడంతో దీనిపైనా చర్చసాగనున్నట్టు తెలుస్తుంది. గవర్నర్ పర్యటనలో మరో ప్రాధాన అంశం స్టేట్ బైఫర్ కేషన్ అయ్యి వన్ ఇయర్ అవుతున్నా..ఇంకా విభజన అంశాలు కొలిక్కి రాలేదు..ఈ అంశాలపై గత నెలలో ఇప్పటికే ఇద్దరు సిఎస్ లు డిల్లీ లో కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. ఇప్పుడు గవర్నర్ నరసింహన్ కూడా ఇరు రాష్ట్రాల విభజన అంశాలపై కేంద్రంతో చర్చించే అవకాశం ఉంది
ఇక ఏపి సిఎం చంద్ర బాబు సైతం డిల్లీ వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరంపై కేంద్రానికి బాబు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ శాంతి భద్రతలకు సంబంధించిన సెక్షన్ 8 అమలు చేయాలని తీర్మానించారు. ఈ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కెబినెట్ లో నిర్ణయించారు. ఫోన్ ట్యాఫింగ్ పాల్పడిన తెలంగాణ గవర్నమెంట్ పై కఠినంగా వ్యవరించాలని గవర్నర్ తో పాటు కేంద్రాన్ని కోరనున్నారు ఏపి సిఎం చంద్రబాబు. ఒకవైపు గవర్నర్ నర్సింహన్... వాస్తవాలను కేంద్రానికి నివేదించనున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ఈ అంశంపై ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఇప్పుడు అంతటా చర్చనీయంగా మారింది..
https://www.youtube.com/watch?v=Iv9c7PfpHL4