నోటుకు ఓటు కేసులో అరెస్టు అయిన టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి మళ్లీ మీసం మెలేశారు. ఇప్పుడిదే అంశం జనాలకు అర్ధం కావడం లేదు..
ఓ వైపు రెండు రాష్ట్రాల సిఎంలు ఇదే అంశంపై మాటల యుధ్దానికి దిగుతూ రెచ్చిపోతున్నారు..ఐతే రేవంత్ మాత్రం తనకేం పట్టనట్లు ఎందుకు మీసం మెలేస్తున్నారు..చిద్విలాసంగా నవ్వుతున్నారో తెలీక జనం జుట్టు పీక్కుంటున్నారు..
నాలుగు రోజుల ఏసీబీ కస్టడీ ముగిసిన తర్వాత రేవంత్ సహా మిగిలిన ఇద్దరు నిందితులకు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఈనెల 15వ తేదీ వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించేదుకు కారులో ఎక్కించారు. ఆసమయంలో అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లు, ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఆయనను కెమేరాల్లో బంధించేందుకు ప్రయత్నించింది. కెమేరాలను చూడగానే రేవంత్ రెడ్డి రెట్టించిన ఉత్సాహంతో మీసంపై చేయి వేసి మెలేశారు. అనంతరం ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.
అరెస్టు సమయంలో తన అరెస్టు ద్వారా ఏం చేయలేరంటూ టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మీసం తిప్పిన రేవంత్, మరిప్పుడు ఎందుకు మళ్లీ మీసం మెలేస్తున్నారో టీవీలు చూస్తున్న సామాన్యులకు అర్ధం కాని ప్రశ్నగా మారుతోంది.. అసలు ఓ వైపు రెండు రాష్ట్రాల మంత్రులూ..ముఖ్యమంత్రులూ మాటల తూటాలు వదులుకుంటుంటూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు..ఈ వ్యవహారాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లారు కూడా..మరి అలాంటప్పుడు రేవంత్ బాడీ లాంగ్వేజ్ ఏం చెప్తున్నదీ అర్ధం కాదు..అంటే ఈ కేసునుంచి తాను సులభంగా బయటపడతాననా..లేక తప్పు చేసినా ఏమీ హాని జరగదనే తెగింపా అనేది తెలుసుకోవాలి.
https://www.youtube.com/watch?v=3JVuu5CYbK4