ఓటుకు నోటు వ్యవహారం ఢిల్లీ చేరుకుంది. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేతలు హస్తిన బాటపట్టారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ పర్యటనపై ఇతర కారణాలు చెబుతున్నా...
లోలోపల మాత్రం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గవర్నర్ నరసింహన్ కూడా ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు.
తెలుగు రాష్ట్రాలను పట్టికుదిపేస్తున్న ఓటుకు నోటు వ్యవహారం ఢిల్లీకి చేరింది.. ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తిన పర్యటన ఖరారు అయింది. ఇరు నేతలూ తమ వాదనలు ఢిల్లీ పెద్దలకు చెప్తారని స్ట్రాంగ్ టాక్ నడుస్తోంది.. వీరి సంగతి అలా ఉంచితే ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఢిల్లీ టూర్ కూడా ఖరారైంది..ఇప్పటిదాకా తనను కలిసిన ముఖ్యమంత్రులిచ్చిన సమాచారం తో పాటు..ఇంటలిజన్స్ నివేదికలు కూడా నరసింహన్ ఢిల్లీలో ఇస్తారని ప్రచారం సాగుతోంది..
ఇక ముఖ్యమంత్రుల హస్తిన టూర్ తో పాటు..ఓటుకు నోటు వ్యవహారాన్ని అందిపుచ్చుకోవడానికి వైసీపీ వ్యూహం రచించింది.. పార్టీ అధినేత జగన్ కూడా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు..రాష్ట్రపతి ప్రణబ్ తో పాటు కేంద్రహోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలవనున్నారాయన. తప్పకుండా రేవంత్ రెడ్డి కేసు వ్యవహారాన్ని వీరిద్దరికీ నివేదిస్తారని పార్టీ వర్గాల సమాచారం..
ఇలా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్, ఓ రాష్ట్ర ప్రతిపక్షనేత..కాస్త అటూ ఇటూగా ఒకే సమయంలో ఢిల్లీలో ఉండబోవడం ఇదే ప్రథమం..దీంతో ఓటుకు నోటు కేసు సీన్ కాస్తా ఢిల్లీకి చేరినట్లే అనుకోవచ్చు..
https://www.youtube.com/watch?v=Lw8RMfDr_SQ