ఏపి సిఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెచ్చిపోయారు..బహిరంగసభల్లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు..ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టారంటూ అరెస్టైన రేవంత్ రెడ్డి కేసు వ్యవహారం..
చివరికి రెండు రాష్ట్రాల మధ్య యుధ్దవాతావరణం కలిగిస్తుందా..అన్నంతగా ముఖ్యమంత్రులిద్దరూ మాటల బాణాలు విసురుకున్నారు..అవి చూసి వినాలే తప్ప...చెప్తే సరిపోవన్నంత వాడి వేడిగా ఉన్నాయ్.
ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి కేసు తెలుగు రాష్ట్రాల సిఎంల మధ్య వైరంగా మారుతోంది. రెండు రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధులు ఈ కేసును తెలుగు ప్రజల ఆత్మగౌరవంగా చిత్రీకరిస్తున్నారు. ముఖ్యమంత్రుల మీద వస్తున్న ఆరోపణలను ఆ రాష్ట్ర ప్రజలకు అన్వయిస్తూ రాజకీయం చేస్తున్నారు. సిఎంలు కూడా నేరుగా ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు.
చినుకూ చినుకూ గాలివానగా మారినట్లు...రేవంత్ రెడ్డి కేసు వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటలయుధ్దానికి దారి తీసింది..ఇద్దరూ ఎక్కడా తగ్గకుండా ఢీ అంటే ఢీ అని సవాళ్లు విసురుకున్నారు..
టిఆర్ఎస్ టిడిపిపై బురదజల్లుతోందని..అనవసరంగా కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఏపి సిఎం చంద్రబాబు ఆరోపించారు.. కేసీఆర్ బెదరింపులకు తాను దడుసుకోనని..ఏసీబీ మీకున్నట్లే..నాకూ ఉంది..పోలీసులు మీకున్నట్లే నాకూ ఉన్నారంటూ చంద్రబాబు మంగళగిరి సంకల్ప సభలో ఆగ్రహంతో ఊగిపోయారు..
నేను కనుక కన్ను తెరిస్తే కేసీఆర్ కు కష్టాలు మొదలవుతాయని..ఎవరెన్ని చేసినా నేను బుల్లెట్ లా దూసుకుపోతానంటూ సవాల్ విసిరారు చంద్రబాబు. ఇది జరిగిన కాసేపటికే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావ్ కూడా అదే స్థాయిలో స్పందించారు.. మీ సంగతేంటో దేశం మొత్తానికి తెలిసిందని..ఇరికిస్తే ఇరుక్కోవడానికైమైనా అమాయకులా అంటూ విమర్శలు గుప్పించారు.. మిమ్మల్ని కేసులో ఇరికించాల్సిన అవసరం మాకేంటని మండిపడ్డారు కేసీఆర్.అరిచినంత మాత్రాన చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.
మొత్తానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ బహిరంగసభల్లో ఇలా ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చకు దారితీస్తోంది..రోజుకో సంచలనం వెలుగులోకి వస్తున్న ఓటుకు నోటు కేసులో ఎప్పుడేం జరుగుతుందో అని ఆసక్తి వ్యక్తమవుతోంది.
https://www.youtube.com/watch?v=5lCREBg7b8A