తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైఫై సేవలు మరింతగా విస్తరిస్తున్నాయి. మొదట ట్యాంక్ బండ్, ఆ తరువాత విశ్వవిఖ్యాత పర్యాటక కేంద్రం చార్మీనార్ ప్రాంతాలలో వైఫై సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే చిన్న చిన్న చిక్కులు కొన్ని సందేహాలు యూజర్స్ ను కన్ ఫ్యూజ్ గురిచేస్తున్నాయి. సేవలు వినియోగించుకోవాలంటే కొన్ని సందేహాలు ఎదురవుతున్నాయి. అలాగే వైఫై సేవలు అంతరాయం లేకుండా అందుబాటులోకి రావాలంటే ఐటిశాఖ చిక్కులను నివృత్తి చేయాలన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది.
ఉచిత వైఫై సేవల కల్పన ద్వారా హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్‌సిటీల జాబితాలో చేర్చేందుకు చేసిన ప్రయత్నం సక్సెస్ దిశగా సాగుతోంది. కానీ వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. వైఫై సేవలను మరింత వేగంగా ఎలాంటి సందేహాలు లేకుండా అందుబాటులోకి వచ్చేలా ఐటి శాఖ చర్యలు తీసుకోవాలని యూజర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి ట్యాంక్ బండ్ చుట్టూ అరగంట పాటు ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. లాంచ్ చేసి నెల కూడా కాకముందే ...వైఫై సేవల్లో వినియోగదారులు కొంత సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో సేవలను వినియోగించుకుందామనుకున్న సిటిజన్స్ కు కాస్త నిరాశ ఎదురైంది. కనీసం మూడు కిలొమిటర్ల పరిధిలో నైన వైఫై సౌకర్యం అందడం లేదన్న ఆరోపణలు వినిపించాయి. కానీ 10 వైఫై హాట్ స్పాట్ పరికరాల ద్వారా కొంతమేర సమస్యకు పరిష్కారం లభించింది.
నగరంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైఫై సేవలు ఎలా వినియోగించుకోవాలన్న స్పష్టత ఇంకా యూసర్స్ ను కన్ ఫ్యూజ్ కు గురిచేస్తూనే ఉంది. ముందుగా స్మార్ట్‌ఫోన్‌లోని సెట్టింగ్స్‌లో వై-ఫై ఆప్షన్‌ను క్లిక్ చేసి. అక్కడ కనిపించే నెట్‌వర్క్‌లో Q5BSNL నెట్‌వర్క్‌పై క్లిక్ చేయాలి. బ్రౌజర్‌లో పూర్తి వివరాలు, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్, విత్ పాస్ వర్డ్ తదితర వివరాలు నమోదు చేసి... సబ్‌మీట్ చేసుకోవాలి. మీ సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా అందే వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఆతరవాత లాగిన్ కావాల్సి ఉంటుంది. తొలి అరగంట ఉచితంగా వై-ఫై సేవలు అందుతాయి. ఆ తరువాత వినియోగదారునికి అరగంట దాటితే చార్జీల రూపంలో వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈవిషయంలో వినియోగదారులకు స్పష్టత లోపిస్తోంది. ఇటీవలే ట్యాంక్ బండ్ లో లాంచ్ అయిన వైఫై సేవలు సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక చార్మీనార్ ప్రాంతంలో కెటీఆర్ ఇటీవల ప్రారభించిన వైఫ్ సేవల్లో ఈసమస్యలు రిపీట్ కాకుండా ఉంటే బాగుంటుందని అంటున్నారు వినియోగదారులు. ముఖ్యంగా వినియోగదారులను ఆప్షన్ల రూపంలో పూర్తి సీక్రెట్ వివరాలు అడగ్గానే కొంతమంది వినియోగదారులు ఈ సేవలు వినియోగించుకోవాలంటే వెనుకంజ వేస్తున్నారు.
నగరం అంత వైఫ్ పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్న మరోవైపు అదే స్ధాయిలో స్పష్టత లోపిస్తోంది. ఈవిషయంలో ఐటి నిపుణులు సమస్యలు, చిక్కుముడులను తొలగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే నగరాన్ని ఐటి హబ్ గా తీర్చుదిద్దుతామని మెరుగైన వైఫై సేవలు మరో 10 ప్రాంతాలలో విస్తరిస్తామని ఐటిశాఖ మంత్రి కేటిఆర్ స్పష్టం చేశారు. సాఫ్ట్ వేర్ నిపుణులు. మైక్రోసాఫ్ట్ నిపుణుల సహాయంతో మెరుగైన సేవలు అందుబాటులోకి తేస్తామంటున్నారు.
ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ చుట్టూ 10 వై-ఫై హాట్ స్పాట్ పరికరాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కో హాట్‌స్పాట్ పరికరం వద్ద ఒకేసారి 500 మంది లాగిన్ అయ్యే అవకాశం ఉంది. అయితే సైబర్‌టవర్స్-మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్ - కొత్తగూడ జంక్షన్, సైబర్ టవర్స్-రహేజా మైండ్‌స్పేస్ సర్కిల్ పరిధిలో గత ఏడాది అక్టోబర్‌లో వైఫైని అందుబాటులోకి తెచ్చారు. 8 కి.మీ మార్గంలో 17 కేంద్రాల వద్ద వై-ఫై సిగ్నల్స్‌ను అందించే హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో సుమారు 20 వేల మంది నిత్యం 750 మెగాబైట్స్ నిడివిగల వై-ఫై సాంకేతిక సేవలను నిరంతరాయంగా వినియోగించుకుంటున్నారు. అప్పుడప్పుడూ స్వల్ప అంతరాయం ఎదురవుతున్నప్పటికీ సాంకేతిక సమస్యలను ఎయిర్‌టెల్ సంస్థ వెంటనే సరిదిద్దుతోంది. అలాగే బిఎస్ ఎన్ ఎల్ సహాయ బృందం స్పందిస్తే బాగుంటుందని అంటున్నారు నగరవాసులు. ట్యాంక్ బండ్, చార్మీనార్ ఇతర ప్రాంతాలలో ఒకేసారీ అంతరాయం కలుగకుండా ప్రభుత్వం ఐటిశాఖ టెక్నికల్ సపోర్ట్ తీసుకొవాలంటున్నారు సీనియర్ సిటజన్స్.