ఒక విజయం...వెంటనే మరొక సమరం. ఎన్నిక ముగిస్తే..ఉప ఎన్నికకు తెరలేస్తుంది. ఏడాది కాలంలో టిఆర్ఎస్ పార్టీకి వరుస ఎన్నికలు. అన్నీ ప్రతిష్టాత్మకమే..అంతటా సమరమే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన గులాబీ నేతలకు వెంటనే వరంగల్ ఉప ఎన్నిక పొంచి ఉంది. వీటి తర్వాత రాబోయే ఏడాదంతా ఎన్నికల సమరమే కానుంది.

 తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత సాధారణ ఎన్నికల నగరా మోగింది. స్వరాష్ట్రం వచ్చింది...స్వయంపాలన కావాలంటూ టిఆర్ఎస్ ప్రచారం మొదలు పెట్టింది. ఈ ఎన్నికలు ముగిస్తే...వచ్చే ఐదేళ్ల వరకు ఇక రాజకీయాలుండవు...అంతా అభివృద్ధి మంత్రమే అని చెప్పింది. గత సమైక్య రాష్ట్రంలో వలే కాకుండా అఖిలపక్ష సమావేశాలు, అందరి అభిప్రాయాలతో బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుతామని చెప్పింది. కానీ వాస్తవంగా ఈ ఏడాది పాలనలో అంతటా ఎన్నికల వాతావరణమే. రాబోయే కాలం కూడా ఎన్నికల సమరానికే సై అంటోంది. తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికల్లో టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే, మెదక్ ఎంపీగా పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించిన తర్వాత సిఎంగా అధికారం చేపట్టాలని నిర్ణయించడంతో మెదక్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో మెదక్ ఉప ఎన్నిక మొదలైంది. టీడీపీ-టిఆర్ఎస్ మధ్య హోరాహోరిగా ఈ పోరు జరిగింది. చివరకు గులాబీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిచారు. 

మెదక్ లోక్ సభ ఉపఎన్నిక పూర్తి కాగానే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలొచ్చాయి. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు చిన్నవే అయినా...అధికార పార్టీగా రంగంలో దిగుతున్నందుకు బోర్డును దక్కించుకునేందుకు టిఆర్ఎస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రచారం చేశారు. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చి ప్రచారం చేశారు. గులాబీ జెండా ఎగురేశారు. ఇవి పూర్తి కాగానే  హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, ఖమ్మం-నల్గొండ-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్. పోటీ చేసే స్థానాలు రెండే అయినా...ఆరు జిల్లాల ఎన్నికలు కావడంతో తెలంగాణలో ఎన్నికల వాతావరణం ముమ్మరంగా కొనసాగింది. ఇందులో ఒక సీటు ఓడి, మరొక సీటు గెలిచి టిఆర్ఎస్ కొంత నిరాశకు గురైంది.  పార్టీ సంస్థాగత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఎన్నికలు జరగడంతో గులాబీ నేతలంతా ఈ ఎలక్షన్లలోనే పనిచేశారు. ఇది పూర్తి కాగానే ఎమ్మెల్సీల ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాలకు పోటీ చేయడంతో ఈ సమరం నువ్వా? నేనా? అన్నట్టు సాగి టిఆర్ఎస్ విజయం సాధించింది. 

ఏడాది మొత్తం దాదాపుగా ఎన్నికలతోనే సాగింది. ఏడాది ఉత్సవాలకు ముందు ఒక రోజు ఎన్నిక పూర్తి కాగా...ఇప్పుడు మళ్లీ వెంటనే మరో ఎన్నికకు తెరలేచింది. వరంగల్ ఎంపీగా ఉండి డిప్యూటీ సిఎం పదవిని చేపట్టిన కడియం శ్రీహరి ప్రస్తుతం ఎమ్మెల్సీగా గెలుపొందారు. దీంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసే ముహూర్తం దగ్గరపడింది. శ్రీహరి రాజీనామాతో ఓరుగల్లు లోక్ సభ ఉప పోరుకు గులాబీ సేన మళ్లీ సిద్ధం కావల్సి ఉంది. శ్రీహరి రాజీనామా తర్వాత టీడీపీ నుంచి వచ్చి మంత్రిగా కొనసాగుతున్న తలసాని రాజీనామా కూడా ఆమోదించాల్సి వస్తుందనే వాదన ఉంది. ఇది జరిగితే నగర పోరు తప్పదు. సనత్ నగర్ ఉప ఎన్నిక ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కంటే ముమ్మరంగా కొనసాగుతుంది. దీని తర్వాత ఈ ఏడాది చివరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎదురు చూస్తున్నాయి. 

త్వరలోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. మొత్తం తొమ్మిది స్థానాలకు ఈ ఎన్నికలు జరగనుండడంతో, అన్ని పార్టీలు వీటిని సవాల్ గా తీసుకుంటాయి. క్యాంపులు, గ్రూపులు, కొనుగోళ్లు, అమ్మకాలు విస్తృతంగా సాగుతాయి. వీటి తర్వాత వాయిదా వేస్తూ వస్తున్న ఈ ఎన్నికల్లో ఏడాది చివరలో నిర్వహించక తప్పని పరిస్థితి. నగర మేయర్ పదవిపై మొదటి నుంచి కన్నేసిన టిఆర్ఎస్ పార్టీ...ఈ ఎన్నికల కోసం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పావులు కదుపుతోంది. దీంతో గ్రేటర్ ఎన్నికలు హాట్ హాట్ గా జరగనున్నాయి. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు తాజాగా మండిపడింది. వెంటనే వీరి సంగతి తేల్చకపోతే తానే నిర్ణయం తీసుకుంటానంది. ఈ అంశంలో ఫిరాయించిన వారి రాజీనామాలు ఆమోదించే పరిస్థితి వస్తే టీడీపీ నుంచి ఐదు, కాంగ్రెస్ నుంచి నాలుగు, వైకాపా నుంచి రెండు స్థానాలకు ఉప ఎన్నికలు తప్పవు. ఈ ఉప ఎన్నికలు జరిగితే...వాటి తీవ్రత ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇలా టిఆర్ఎస్ పాలన రెండో ఏడాది కూడా ఎన్నికల ఏడాదిగా మారనుంది. తెలంగాణలో వచ్చే ప్రతి ఎన్నికల్లో విజయం సాధించాలనే తాపత్రయంతో టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంటే...నిరంకుశంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీని ఆకాశం నుంచి కిందకు దించాలనే కసిలో ప్రతిపక్షాలున్నాయి. దీంతో ప్రతి ఎన్నిక ఒక సమరంగా మారుతోంది. మరి రాబోయే ఎన్నికల్లో ఇంకా ఎన్ని పంతాలు, వింతలు చూడాల్సి ఉందో.

 

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...