హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని
నాందేడ్‌లోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు సీఎం కేసీఆర్‌ను కోరినట్లు సమాచారం. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేసీఆర్ పోటీ చేసేందుకు అంగీకరించినట్టు సమాచారం. కాగా... గతంలో నాందేడ్ జిల్లాలోని 6 నియోజకవర్గాలను తెలంగాణలో కలపాలని అక్కడి నేతలు ఉద్యమించినా విషయం తెలిసిందే.