విశాఖపట్నం: ఏపీలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సోదరుడు
సన్యాసి పాత్రుడు రాజీనామా చేశాడు. ఆయనతో పాటి మరో 10 మంది స్థానిక నేతలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. అందులో కౌన్సిలర్లు, ఇతర సంఘాల నేతలు కూడా ఉన్నారు. అనంతరం సన్యాసి పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ... మేము ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే... ఈ పది మంది నేతలు వైసీపీ ఫ్యాన్ కిందకు వెళతారా..? లేకుంటే బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది.