హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి తన పార్టీ మార్పు విషయంపై ఈ రోజు ఓ సంచలన ప్రకటన చేశారు. కావాలనే
కొందరు తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అయితే... ఆ ప్రచారం గాంధీభవన్ నుంచే ప్రారంభమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అబద్దపు ప్రచారంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించానని ఆమె చెప్పారు. పార్టీ మారడంపై తాను హడావుడి నిర్ణయాలు తీసుకోనని, ఒకవేళ పార్టీ మారితే బహిరంగంగానే ప్రకటిస్తానంటూ విజయశాంతి తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని ఉత్తమ్ వద్ద కూడా స్పష్టం చేశానని విజయశాంతి తేల్చి చెప్పారు.